కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టాలని మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ చీఫ్ KCR నేతలకు సూచించారు. నిన్న కేటీఆర్, పలువురు పార్టీ నేతలు ఆయనతో భేటీ అయ్యారు. ఫార్ములా- ఈ రేసు కేసు విచారణ గురించి ఆయనకు KTR వివరించారు. 'అధికారం చేపట్టిన ఏడాదిలోపే కాంగ్రెస్ ప్రభుత్వం తేలిపోయింది. సంక్రాంతి తర్వాత పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలి. ఫిబ్రవరి లేదా మార్చిలో బహిరంగ సభ నిర్వహిద్దాం' అని కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.