మిడ్ మానేర్ నిర్వాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్

56చూసినవారు
మిడ్ మానేర్ నిర్వాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్
TG: మిడ్ మానేర్ నిర్వాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మిడ్ మానేర్ నిర్వాసితులకు 4 వేల 696 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేసిన‌ట్లు వేములవాడ ఎమ్మెల్యే, విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఇచ్చిన‌మాట ప్రకారం నిర్వాసితులకు అండగా నిలిచామ‌న్నారు. నాడు ప్రతిపక్ష నాయకుడిగా ముంపు గ్రామాల ప్రజలని ఆదుకుంటానని‌ మాట ఇచ్చిన‌ట్లు ఎమ్మెల్యే గుర్తుచేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రులు పొన్నం, భట్టి విక్రమార్కల‌కి కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్