కేసీఆర్‌కు బిగ్ షాకిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం

82చూసినవారు
కేసీఆర్‌కు బిగ్ షాకిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం
మాజీ సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా ప్రస్తుతం ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కంపెనీకి 2023 డిసెంబర్ 7కు ముందే అప్పటి సీఎం కేసీఆర్ NOC, ఇతర అనుమతులు ఇచ్చారని రేవంత్ సర్కార్ పేర్కొంది. ఆ పత్రాలను విడుదల చేసింది. ఈ కంపెనీ తలసాని కుటుంబికులకు చెందినది కావడంతో ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేయలేదని పేర్కొంది.

సంబంధిత పోస్ట్