TG: బీసీల విషయంలో కాంగ్రెస్ నయవంచన చేసిందని.. కామారెడ్డి డిక్లరేషన్ ఇక చెత్తబుట్టలో పారేయాల్సిందేనని BRS నేత శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. 'కులగణన ఏదో గొప్పగా చేశామని దేశానికి రోల్ మోడల్ అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికల్లో చెప్పిందేమిటి? చేసిందేమిటి? 60% జనాభా ఉన్న BCలకు మంత్రి పదవులు మూడేనా? BCలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మంత్రివర్గ కూర్పులో ఎందుకు పాటించలేదు? BC సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత ఏది?' అని ప్రశ్నించారు.