రాష్ట్రాన్ని కాపాడాలనే ఆలోచన కాంగ్రెస్‌కు లేదు: హరీశ్‌రావు

64చూసినవారు
రాష్ట్రాన్ని కాపాడాలనే ఆలోచన కాంగ్రెస్‌కు లేదు: హరీశ్‌రావు
TG: గోదావరి - బనకచర్ల లింక్‌ ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బనకచర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం నిర్మిస్తుంటే.. మన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని, కృష్ణా జలాలను అక్రమంగా తరలించడానికి పోతిరెడ్డిపాడు ఎలా మారిందో.. గోదావరి జలాలను తరలించుకుపోవడానికి బనకచర్ల అలా ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్