రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై BRS పార్టీ 'X' వేదికగా మండిపడింది. 'కాంగ్రెస్ అంటేనే మోసం, దగా. ఎన్నికల ముందు ప్రతీ రైతుకు రైతు భరోసా సాయం కింద ఎకరాకు రూ.15,000 ఇస్తానని హామీ ఇచ్చి, నేడు అధికారంలోకి వచ్చాక ఎకరాకు రూ.12,000 మాత్రమే ఇస్తామంటూ మాట మార్చేసిన చిట్టి నాయుడు' అని ఒక వీడియోను జోడించింది. కాగా, శనివారం కేబినెట్ భేటీ అనంతరం సీఎం రేవంత్ రైతులకు ఎకరాకు ఏడాదికి రూ. 12,000 ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.