కాంగ్రెస్ పార్టీ కులగణనతో బీసీలకు అన్యాయం చేస్తోందని కేంద్రమంత్రి విమర్శించారు. కిషన్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. "కులగణన జరిపిన విధానం సరిగ్గా లేదు హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని ఏ చట్టంలో ఉంది? కులాలు, మతాలు పేరిట ప్రజలను విడగొట్టడం కాంగ్రెస్, రాహుల్ కు అలవాటే. కులగణన సర్వేపై బీసీ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి." అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.