TG: గుండెపోటుతో కాంగ్రెస్ పార్టీ విలేజ్ ప్రెసిడెంట్ అయిన ఈర్ల రాజు (52) ఆదివారం మృతి చెందారు. ఈయన సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామానికి చెందిన నాయకుడు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక రాజు మృతికి కాంగ్రెస్ పార్టీ మండల, నియోజకవర్గ నాయకులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.