కేసీఆర్ ఆస్తులపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు

56చూసినవారు
కేసీఆర్ ఆస్తులపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు
TG: కేసీఆర్ ఆస్తులపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ.. 2009లో కేసీఆర్ ఆస్తులు రూ 4.32 కోట్లు ఉంటే 2014 లో అవి దాదాపు రూ.8 కోట్లకు చేరాయని అన్నారు. అందరూ ఆస్తులు అమ్ముకొని ఉద్యమాలు చేస్తే కేసీఆర్ కు మాత్రం ఉద్యమం సమయంలో 4 కోట్ల ఆస్తులు పెరిగాయని విమర్శించారు. 2018లో 41 కోట్లు, 2023లో 53 కోట్లు చూపించారని చెప్పారు. ఇంత డబ్బు కేసీఆర్ ఫ్యామిలీకి ఎలా వచ్చిందో చెప్పాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్