TG: కాంగ్రెస్ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. లిక్కర్ సిండికేట్ నిర్వాహకుల నుంచి ఆయన డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లుగా ఉన్న ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఎమ్మెల్యే సామెల్ తనకు మామూళ్లు ఇవ్వాలంటూ అక్కడ ఉన్నవారిని బెదిరించారు. మీరిచ్చే మామూల్లు నా టీ ఖర్చులకు సరిపోవని, రోజుకు లక్ష ఖర్చు అవుతోందని బాధితులకు చెబుతున్నారు. ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టాను. వాటిని పదవిలో ఉన్నప్పుడు రాబట్టాలి అంటూ చెప్పుకొచ్చారు.