TG: కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సవాల్ విసిరారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ '10 ఏళ్లల్లో బీఆర్ఎస్ ఏం సాధించింది? 15 నెలల్లో కాంగ్రెస్ ఏం చేసిందో చర్చకు రండి. మేం నిరూపిస్తాం. దళితుడిని సీఎం చేస్తామని గతంలో మీ మ్యానిఫెస్టోలో చేర్చారు. దీనికి ఖర్చు లేదు, కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ పని ఎందుకు చేయలేదు?' అని ప్రశ్నించారు.