తెలంగాణలో SC డిక్లరేషన్ అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు కూడా క్షమాపణ చెప్పాలన్నారు. 'దళిత డిక్లరేషన్ ఇచ్చిన హామీల సంగతి ఏమైంది? SC డిక్లరేషన్ అమలులో పూర్తిగా విఫలమైంది. రేవంత్ లాంటి మోసగాడు చెప్తే నమ్మరని, ఖర్గేను తెచ్చి ఎస్సీ రిజర్వేషన్ ప్రకటింపజేశారు' అని విమర్శించారు.