రేపటి నుంచి కాంగ్రెస్‌ సన్నాహక సమావేశాలు

71చూసినవారు
రేపటి నుంచి కాంగ్రెస్‌ సన్నాహక సమావేశాలు
TG: కాంగ్రెస్‌ పార్టీ ఈ నెల 6 నుంచి 8 వరకు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించ తలపెట్టింది. 6న ADBలో, 7న NZB, 8న KRMRలో నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, PCC చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఆయా జిల్లాల్లో పర్యటిస్తారు. కరీంనగర్‌లో 8న నిర్వహించే సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ హాజరవుతారని సమాచారం.

సంబంధిత పోస్ట్