TG: స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్‌పై సోమవారం క్యాబినెట్‌లో చర్చించాక స్పష్టతనిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయన్నారు. ఆ తర్వాత సర్పంచి, మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని వివరించారు. కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గెలిచే అవకాశాలున్న అభ్యర్థులనే ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు.