మాట తప్పడమే.. మడమ తిప్పడమే కాంగ్రెస్ నైజం అని BRS MLC కవిత ఫైర్ అయ్యారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సంతకాలు పెట్టిన గ్యారెంటీ కార్టులను ఇంటింటికి పంచి ఓట్లేయించుకున్నారని.. ఇప్పుడు గ్యారెంటీలు అమలు చేయకుండా మోసం చేస్తోందని మండిపడ్డారు. వందలాది మంది తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాలకు కారణం కాంగ్రెస్ అని విమర్శించారు. ఏడాదిన్నర పాలనలోనే వ్యతిరేకత మూటగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నోబుల్ ప్రైజ్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు.