TG: కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న విమర్శలపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ నుంచి బీఆర్ఎస్ అధ్యక్ష పదవి తీసుకొని.. ఈ మూడున్నరేళ్లు కష్టపడి పార్టీని అధికారంలోకి తేవాలని సవాల్ విసిరారు. అప్పటివరకు కేటీఆర్ పనికిరాని వ్యక్తిగానే ఉంటారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలపై అసత్య ప్రచారం మానుకోవాలని సూచించారు.