కాంగ్రెస్ పాపం రైతన్నలకు శాపం: హరీశ్ రావు

52చూసినవారు
కాంగ్రెస్ పాపం రైతన్నలకు శాపం: హరీశ్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వం వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టి రైతన్నకు భరోసా లేకుండా చేసారని BRS నేత హరీశ్ రావు విమర్శించారు. 'యాసంగి భరోసా సంక్రాంతికి ఇస్తమన్నరు. మాట మార్చి 26, జనవరికి అన్నరు. అది కూడా కాదని మార్చి 31 వరకు ఇస్తమని ప్రకటించారు. కాంగ్రెస్ పాలనలో కోతల కాలం వచ్చినా రైతు భరోసా వస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పాపం రైతన్నలకు శాపంగా మారింది. 14నెలల పాలనలో 415పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరం' అని విమర్శించారు.

సంబంధిత పోస్ట్