ఈడీ కార్యాలయం వద్ద రేపు కాంగ్రెస్ ధర్నా

58చూసినవారు
ఈడీ కార్యాలయం వద్ద రేపు కాంగ్రెస్ ధర్నా
TG: నేషనల్​ హెరాల్డ్ వార్తా పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్​ కేసులో ED చార్జ్​షీట్​ దాఖలు చేసింది. అందులో కాంగ్రెస్​ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్​గాంధీ పేర్లను చేర్చింది. దీనిపై ఆగ్రహించిన కాంగ్రెస్.. టీపీసీసీ ఆధ్వర్యంలో గురువారం ఈడీ కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నట్లు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ వెల్లడించారు. ఈడీ వైఖరిని నిరసిస్తూ.. రేపు ఉ.10 గంటలకు ఈడీ కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :