ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన మహిళకు సీపీఆర్ చేసి ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కాపాడారు. మహబూబాబాద్‌కు చెందిన ఓ మహిళ కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కానిస్టేబుల్ రాంబాబు సీపీఆర్ చేసి మహిళ ప్రాణాలను కాపాడారు. చికిత్స నిమిత్తం ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.