భారత్-పాక్ మధ్య టెన్షన్ వాతావరణం ఉందడంతో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో తెలంగాణ ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. సరిహద్దు రాష్ట్రాల్లోని తెలంగాణ వాసుల కోసం తక్షణ సేవలు అందించేందుకు, 24*7 పనిచేసేలా అందుబాటులోకి తీసుకొచ్చింది. 011-23380556, 9871999044, 9971387500, 9643723157, 9949351270 నంబర్ల ద్వారా సహాయం కోసం అధికారులను ప్రజలు సంప్రదించవచ్చని పేర్కొంది.