తాము ఎవరి మనోభావాలు దెబ్బ తీసేలా ‘కన్నప్ప’ సినిమా తీయలేదని హీరో మంచు విష్ణు అన్నారు. ఇందులో బ్రహ్మానందం, సప్తగిరి పోషించిన పాత్రల పేర్లు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ బ్రహ్మాణ వర్గం ఆందోళన చేపట్టింది. సినిమాలో ఆ పేర్లను తొలగించకపోతే, విడుదలు అడ్డుకుంటామని హెచ్చరించింది. గుంటూరులో ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగానూ ఆందోళన చేపట్టారు. కాగా ఈ వివాదంపై మంచు విష్ణు స్పష్టత ఇచ్చారు. ఈ మూవీ జూన్ 27న థియేటర్స్‌లోకి రానుంది.