చిత్తూరు జిల్లాకు చెందిన చందన జయరాం తన ప్రతిభతో యువతులందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. శాంతిపురం మండలంలో ఓ రైతు కుటుంబంలో పుట్టిన చందన మిస్ యూనివర్స్ ఆంధ్రా పోటీల్లో కిరిటీం గెలుచుకుంది. మోడలింగ్‌పై తనకున్న ఆసక్తితో తల్లిదండ్రును ఒప్పించి మరీ మిస్ యూనివర్స్ ఏపీగా నిలిచింది. ప్రస్తుతం వాణిజ్య ప్రకటనల ప్రచారకర్తగా రాణిస్తూ పట్టుదలతో ప్రయత్నిస్తే మహిళలు ఏరంగంలో అయిన విజయం సాధించవచ్చని నిరూపిస్తుంది.