వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి. అయితే గతంలో 10 నుంచి 15 శాతం వరకు పెరిగిన విషయం తెలిసిందే. సన్ ఫ్లవర్ ఆయిల్ ధర రూ. 130 వరకు ఉండేది. ఇప్పుడు రూ.150 కు చేరింది. పామాయిల్ గతంలో కిలో రూ. 100 ఉండగా.. ప్రస్తుతం 35 నుంచి 40 రూపాయిల వరకు పెరిగింది. ద్రవ్యోల్బణంతో వంట నూనె ధరలు భారీగా పెరుగుతున్నట్లు తెలుస్తుంది. భారతీయులు వినియోగించే వంట నూనెలో 60 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతుంది.