దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజ్రంభిస్తోంది. రోజు రోజుకు కరోనా మరణాలు, కేసులు భారీగా పెరుగుతున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం 7,100 కరోనా కేసులు ఉన్నాయి. కేరళలో 2,055 యాక్టివ్ కేసులు నమోదవ్వడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. తరువాత పశ్చిమ బెంగాల్ 747, ఢిల్లీ 714, మహారాష్ట్ర 629 ఉన్నాయి. గుజరాత్ తో కూడా గత 24 గంటల్లో 1,358 యాక్టివ్ కేసులు, రెండు మరణాలతో గణనీయమైన పెరుగుదల నమోదైంది.