దేశంలో కరోనా చాపకింద నీరులా వేగంగా విస్తరిస్తోంది. 6,815కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. ఒక్క కేరళలోనే 2,223 కేసులున్నట్లు ఆ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ వీనా జార్జ్ తెలిపారు. ‘ఒమిక్రాన్ JN-1 వేరియెంట్ కేరళలో వేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ వృద్ధులు, ఇతర వ్యాధులున్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వలను పెంచుతున్నాం. అవసరమైతేనే ఆస్పత్రికి వెళ్లిండి’ అని మంత్రి వివరించారు.