TG: సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు స్మార్ట్ కార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు ప్రభుత్వం కాస్మోటిక్ ఛార్జీల కింద నగదును అందిస్తోంది. ఈ నగదును ఇకపై నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. జమ అయిన సొమ్ము నుంచి విద్యార్థి అవసరాలకు అనుగుణంగా స్మార్ట్ కార్డు ద్వారా ఖర్చు చేసే వెసులుబాటు కల్పించనుంది.