ఆర్థర్ కాటన్ 1818లో యువకుడిగా భారత్‌కు వచ్చి, 1860లో పదవీ విరమణ చేసి బ్రిటన్‌కు వెళ్లిపోయారు. అప్పుడు బ్రిటీష్ ప్రభుత్వం ఆయనకు సర్ బిరుదును ప్రదానం చేసింది. 1863లో మరోసారి భారత్‌కు వచ్చి, సోన్ లోయలో నీటిపారుదల ప్రాజెక్టులకు సలహాలిచ్చారు. 1899 జూలై 24న 96 ఏళ్ల వయసులో వృద్ధాప్యంతో మరణించారు. నేటికీ భారతీయుల్లో ఆయనకు గుర్తింపు తగ్గలేదంటే ఆయన ప్రణాళికలు, చేసిన శ్రమ, వాటి ఫలితాలు అర్థం చేసుకోవచ్చు.