రాజమహేంద్రవరంలో మరణానంతరం కుటుంబీకులు పిండ ప్రదానం సమయంలో కాటన్ పేరును స్మరించడం ఆనవాయితీగా వస్తుంది. పుష్కరాలు, ఇతర ప్రధాన సందర్భాల్లో దేశ నాయకులతో పాటు కాటన్‌ను గుర్తు చేసుకుంటారు. తమ పూర్వీకులతో పాటుగా కాటన్ ఆత్మకు కూడా శాంతి చేకూరాలని కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఆచారం స్థానిక సంప్రదాయంలో భాగమని పురోహితులు చెబుతున్నారు.