ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపు జరగనుంది. మొత్తం 70 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మేజిక్ ఫిగర్ 36 సాధించిన పార్టీ ఢిల్లీ పీఠం దక్కించుకోనుంది. కాగా కౌంటింగ్ సెంటర్ల వద్ద ఈసీ పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసింది.