చెట్టుకు ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య

0చూసినవారు
చెట్టుకు ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య
AP: ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లెలో ఆదివారం తెల్లవారుజామున విషాదం చోటు చేసుకుంది. పెళ్లికి పెద్దలు నిరాకరించారని ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. యువతీయువకుడు చెట్టుకు ఉరేసుకుని కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం మాధవరం వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్