TG: కరీంనగర్‌లోని వావిలాల పల్లిలో దారుణం చోటుచేసుకుంది. పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని ఓ ప్రేమ జంట ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చొప్పదండి మండలానికి చెందిన అలేఖ్య (21), అరుణ్ కుమార్(24) స్నేహితుడి గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య పాల్పడ్డారని అన్నారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.