AP: ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లె సమీపంలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. మృతులు రాముడు (24), భారతి (20)లది నంద్యాల జిల్లా మధవరం గ్రామం. భారతికి రెండేళ్ల క్రితం వివాహం జరిగి భర్తను విడిచిపెట్టింది. వరుసకు అన్న అయిన రాముడుతో భారతి ప్రేమలో పడ్డారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదు. దాంతో వీరిద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.