రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

81చూసినవారు
రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి
AP: విశాఖలోని అగనంపూడి టోల్‌గేట్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న గొర్లె మన్మథరావు, అరుణకుమారిని టిప్పర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. టిప్పర్‌ డ్రైవర్‌ అతివేగంగా వాహనాన్ని నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. పోలీసులు వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్