TG: మెదక్ జిల్లా రామాయంపేటలో షాకింగ్ ఘటన జరిగింది. దంపతులు తమ మూడేళ్ల పాపతో మిస్ అయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. రాయిలాపూర్ గ్రామానికి చెందిన ప్రేమ్‌కుమార్ అతని భార్య ప్రియ మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. అయితే భర్త ప్రేమ్ కుమార్ రోజులాగే ఆఫీస్ వెళ్లగా.. ప్రియ తన మూడేళ్ల కూతురిని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. అనంతరం ఆఫీస్‌కు వెళ్లిన ప్రేమ్‌కుమార్ కూడా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.