ఢిల్లీ మెట్రో తరచుగా వార్తల్లో నిలుస్తుంటుంది. మహిళలు గొడవలు పడటం, యువకులు కొట్లాడుకోవడం, యువతులు డ్యాన్సులు చేయడం లాంటివి చూస్తూనే ఉన్నాం. తాజాగా మరోసారి ఢిల్లీ మెట్రోలో జరిగిన ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందులో డోర్ వద్ద నిల్చున్న ఓ జంట సాన్నిహిత్యంగా ఉండడంతో పక్కనే ఉన్న ఓ మహిళ వారితో వాగ్వాదానికి దిగింది. రైలులో ఇలాంటి పనులు చేయవద్దంటూ గొడవకు దిగింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.