ప్రముఖ సినీ నటుడు, లోకనాయకుడు కమల్ హాసన్‌కు బెంగళూరు సివిల్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కన్నడ భాష లేదా సంస్కృతి గౌరవానికి భంగం కలిగించేలా ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఆయన్ను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గత నెలలో తన 'థగ్ లైఫ్' సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా కమల్ హాసన్ మాట్లాడుతూ "కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది" అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర దుమారాన్ని రేపాయి.