కోవిడ్-19తో పాటు అడినోవైరస్, రైనో వైరస్‌లు హాంకాంగ్, సింగపూర్‌లో వేగంగా వ్యాపిస్తున్నాయి. హాంకాంగ్‌లో 17, 13 నెలల చిన్నారులు వైరస్‌ల బారినపడ్డారు. ఈ నెల 3న తొలి కేసు వెలుగులోకి రాగా, వారం రోజుల్లో సింగపూర్‌లో 14,200 కేసులు నమోదయ్యాయి. దీంతో మాస్క్ ధరించడం అక్కడ తప్పనిసరి చేశారు. తాజా వైరస్ పరిస్థితిపై WHO అప్రమత్తమై సమీక్ష ప్రారంభించింది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.