TG: రాష్ట్రంలోని ఏడు సంప్రదాయ వర్సిటీలతోపాటు JNTUHలోని పీజీ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించనున్న ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్) నోటిఫికేషన్ ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు విడుదల కానుంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ బాలకిష్టారెడ్డి తదితరులు నోటిఫికేషన్, దరఖాస్తుల షెడ్యూల్‌ను విడుదల చేస్తారని కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.