AP: ప్రముఖ దేవాలయం తిరుమల ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలో సీపీఐ నేత నారాయణ కూటమి ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. తిరుమల పవిత్రతతో పాటు TTD వ్యవస్థను కాపాడాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ఇలాంటి దేవాలయాలకు చెడ్డ పేరు వస్తే సర్కార్‌కు అప్రతిష్టేనని, గోశాల దాణా విషయంలో అక్రమాలు జరిగితే ఖచ్చితంగా విచారణ జరిపించాల్సిందేనని నారాయణ తేల్చిచెప్పారు.