పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్‌కు సింధు జలాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా సీపీఐ పాకిస్తాన్‌కు నీటిని విడుదల చేయాలని ధర్నా చేపట్టింది. భారత ప్రభుత్వం సింధూ నదీ జలాల నిలిపివేత నిర్ణయానికి వ్యతిరేకంగా సీపీఐ ధర్నాకు దిగింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్‌లో సింధు జల ఒప్పందం రద్దును వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.