క్రెడిట్ స్కోరు అవసరం లేనిదేనని కొంతమంది భావించినా, జీవితంలో ఓ దశలో ఇది కీలకంగా మారుతుంది. క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్, హోమ్ లోన్, కార్ లోన్, విద్యా రుణం.. ఇవన్నీ క్రెడిట్ స్కోరు ఆధారంగానే మంజూరు అవుతాయి. మంచి స్కోరు ఉంటే తక్కువ వడ్డీకి రుణాలు లభిస్తాయి. తొందరగా లోన్ వస్తుంది. అంతేకాదు, ప్రీ అప్రూవ్డ్ లోన్ అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పటినుంచే మంచి క్రెడిట్ స్కోరు నిర్మించుకోండి.