ఒలింపిక్స్‌లో ఎట్టకేలకు క్రికెట్‌ను కూడా నిర్వహించనున్నారు. ఒలింపిక్స్‌లో చివరగా 1900లో క్రికెట్ ఆడగా 128 ఏళ్ల తర్వాత 2028లో లాస్‌ఏంజెలెస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చనున్నట్లు ఒలింపిక్ నిర్వాహకులు తెలిపారు. మొత్తం ఆరు జట్లతో ట్వీ20 తరహాలో పోటీలు జరగనుండగా పురుషులు, మహిళల జట్లు పాల్గొనే అవకాశం ఉంది.