128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లోకి క్రికెట్.. వేదిక ఖరారు

82చూసినవారు
128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లోకి క్రికెట్.. వేదిక ఖరారు
2028లో లాస్ ఏంజిల్స్‌లో జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్‌కు చోటు లభించిన విషయం తెలిసిందే. తాజాగా క్రికెట్ టోర్నీని నిర్వహించే వేదికను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రకటించింది. దక్షిణ కాలిఫోర్నియాలోని పొమోనా నగరంలో ఉన్న ఫెయిర్‌గ్రౌండ్స్‌ స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు తెలిపింది. సుమారు 128 ఏళ్ల తర్వాత క్రికెట్ మళ్లీ ఒలింపిక్స్‌లోకి ప్రవేశించడం క్రీడాభిమానులను ఖుషి చేసింది.

సంబంధిత పోస్ట్