అవయవ దానంపై టీమిండియా క్రికెటర్లు అవగాహన కల్పించారు. ఇంగ్లాండ్‌తో భారత్ బుధవారం మూడో వన్డే ఆడనుంది. ఈ మ్యాచ్‌లో అవయవదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది. ఈ మేరకు భారత క్రికెటర్లతో కూడిన వీడియో సందేశాన్ని రిలీజ్ చేసింది. 'అవయవ దానం చేయండి.. ప్రాణాలు కాపాడండి' అనే థీమ్‌తో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొంది.