ఉత్తరప్రదేశ్ లలిత్‌పూర్‌లో అరుదైన ఘటన జరిగింది. క్రిమినల్ కేసులో అరెస్టయిన నిందితుడు పోలీసులతో కలిసి బైక్‌పై ప్రయాణించాడు. విచిత్రమేమిటంటే ఆ బైక్‌ను నిందితుడే నడిపించాడు. అతడి చేతికి తాడు కట్టి ఇద్దరు పోలీసులు వెనుక కూర్చున్నారు. కోర్టులో హాజరుపర్చేందుకు ఇలా తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ వీడియో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు వ్యవహారశైలిపై అధికారులు విచారణకు ఆదేశించారు.