తోటకూర సాగులో సస్యరక్షణ చర్యలు

57చూసినవారు
తోటకూర సాగులో సస్యరక్షణ చర్యలు
తోటకూర ఆకు అడుగు భాగాన తెల్లటి బుడిపెలు వంటివి ఏర్పడతాయి. లేత పసుపురంగు మచ్చలు ఏర్పడి పండుబారి పోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రాములు కాపర్‌ఆక్సీక్లోరైడ్‌ కలిపి పిచికారి చేయాలి. ఆకును తినే గొంగళి పురుగు, చిన్న, పెద్దవి ఆకును తినివేసి చిల్లులు చేస్తాయి. అందువల్ల మార్కెట్‌లో సరైన రేటురాదు. వీటి నివారణకు మలాథియాన్‌ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. చేసిన తరువాత కనీసం 10 రోజుల తరువాత ఆకును కోసుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్