మరో రెండు వారాల్లో ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా ముగియనున్న నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ కన్పిస్తోంది. ఇవాళ త్రివేణీ సంగమం వద్ద పవిత్ర స్నానాల కోసం దేశ నలుమూలాల నుంచి చేరుకున్న భక్తులతో ప్రయాగ్‌రాజ్‌లో సందడి వాతావరణం నెలకొంది. కాగా, జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఈనెల 26తో ముగియనుంది. ఇప్పటికే 50 కోట్ల మందికిపైగా భక్తులు త్రివేణీ సంగమంలో స్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది.