భద్రాద్రి, కొండగట్టులో భక్తుల రద్దీ

75చూసినవారు
భద్రాద్రి, కొండగట్టులో భక్తుల రద్దీ
భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు రావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఉచిత దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. అటు జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయానికీ భక్తులు పోటెత్తారు. శనివారం రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. దీంతో క్యూలైన్‌లు నిండి వెలుపల వరకు బారులు తీరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్