తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి సగటున 18 గంటల సమయం పడుతోంది. భక్తులు కంపార్ట్మెంట్లను దాటి కష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు ఎదురుచూస్తున్నారు. నిన్న 75,096 మంది భక్తులు శ్రీవారి దర్శనానికి హాజరయ్యారు. 36,262 మంది తలనీలాలు సమర్పించారు. టీటీడీ అధికారుల ప్రకారం.. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.93 కోట్లు వచ్చింది.