AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వ దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. మరోవైపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్‌లన్నీ నిండిపోయి.. MBC వరకు భక్తులు వేచి ఉన్నారు. సోమవారం స్వామిని 73,078 మంది దర్శించుకోగా.. 33,571 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.58 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.